TG: ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికారంగా భావించలేదని సీఎం రేవంత్ అన్నారు. ‘ప్రభుత్వం అంటే నలుగురి చేతిలో అధికారం కాదు. ప్రజాదరణ మా బాధ్యతను పెంచింది. రెండున్నరేళ్లలో అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పై అభిమానం చూపారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం. రాచరిక ఆలోచనలను ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు’ అని అన్నారు.