విశాఖలోని బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలోకి ఛైర్మన్ కందుల నాగరాజు చెప్పులతో ప్రవేశించారంటూ వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. ఆలయంలో క్యూ లైన్ను పరిశీలిస్తూ చెప్పులతో తిరిగారని ఆరోపించింది. ఇలాంటి వ్యక్తులా ఆలయాల పవిత్రతను కాపాడేది అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవాలయాలను టీడీపీ నుంచి కాపాడాలని వైసీపీ పోస్టులో పేర్కొంది.