MLG: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు మంత్రి సీతక్క పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మరణించిన అమరుల త్యాగాలు మరువలేనివని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు.