MHBD: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.