అన్నమయ్య: జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పీలేరు (M) దొడ్డిపల్లి పంచాయతీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీ సమీపంలో సోమవారం నవీన్ (35) రైలు కిందపడి మృతి చెందాడు. బండ్లపల్లెకి చెందిన నవీన్ కడప రోడ్డులో టీ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం నరసాపూర్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.