NRML: ఎంతో మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుటకు పోలీస్ శాఖపై గురుతర బాధ్యత ఉందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ధనిక, పేద తేడాలు లేకుండా ఒకే రకమైన పోలీసు సేవలు అందించాలని సిబ్బందికి వారు ఈ సందర్భంగా సూచించారు .