KMM: మధిరలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు 44వ జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి పాఠశాలకు గుర్తింపు తీసుకువచ్చారు. విజేతలను క్రీడాభిమానులు, తోటి విద్యార్థులు అభినందించారు.