NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ పున్న శైలజ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించి ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రామదుర్గారెడ్డి, తదితరులున్నారు.