SRCL: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని జెండా ఆవిష్కరించి రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.