NLR: ముదివర్తికి చెందిన రైతు గోపాలయ్య పొలంలో అదే గ్రామానికి చెందిన వేగూరు గోపాలయ్య వ్యవసాయ సామాగ్రి ధ్వంసం చేయడంపై కేసు నమోదు చేసినట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. పొలం వద్ద ప్లాస్టిక్ పైపులు కత్తిరించి మోటారును కేసింగ్ పైపులో పడేసి తనను చూసి పరారైనట్లు బాధితుడు తెలిపారన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.