తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే పలు శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ.. కొలువుల జాతర కొనసాగుతుందన్నారు. TGPSCని ప్రక్షాళన చేశామని, విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులను అందిస్తున్నట్లు చెప్పారు.