WG: పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. CITU నాయకులు సోమవారం పెనుగొండ పంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కనీస ఉద్యోగ భద్రత లేదని, ప్రతి నెలా ఇచ్చే జీతాలు సైతం ఇవ్వకపోవడం దారుణమని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ. 26 వేల జీతం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.