KRNL: నగరంలోని నన్నూరు టోల్ ప్లాజా సమీపంలో సోమవారం ఉపాధ్యాయురాలు సులోచనమ్మ ఇంట్లో చైన్ స్నాచింగ్ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకుపోయినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.