NLG: కనగల్ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకానున్నారు. ఆలయం వద్ద పాలకమండలి సభ్యులతో పాటు ఛైర్మన్ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఈవో అంబటి నాగిరెడ్డి తెలిపారు.