జూన్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా ఉన్నాయి. జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారం, జూన్ 13న రెండో శనివారం, జూన్ 27న నాలుగో శనివారం సందర్భంగా సెలవు ఉండనుంది. అలాగే, మొహర్రం సందర్భంగా 25న ఏపీలో, 26న తెలంగాణలో హాలిడే ఉంది. ఈ తేదీల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఆన్లైన్ సేవలు పనిచేస్తాయి. కస్టమర్లు అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలి.