WGL: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు గుర్తు చేశారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదం ఆవిర్భవించింది. ఉద్యమ సమయంలో దీక్షలు చేపట్టి తెలంగాణ సాధనకు అండగా నిలిచారని, జర్నలిస్టుల సంఘం ఏర్పాటుకు కూడా వరంగల్ జర్నలిస్టులే పునాది వేశారని పేర్కొన్నారు.