CTR: పుంగనూరు గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.