ELR: నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం రాత్రి ప్రారంభించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో గ్రామంలో రూ. 72 లక్షలతో అభివృద్ధి పనులు కొనసాగించామన్నారు. పీ4 కార్యక్రమంతో దేశంలో ఆదర్శంగా నిలిచామన్నారు.