సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలంగాణ తల్లికి పూలమాలవేసి నమస్కరించారు. అమరవీరుల స్థూపానికి పుష్పాలు సమర్పించి అమరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ గేయం అధికారులు, కలెక్టర్ ఆలపించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.