ప్రకాశం: జిల్లా ఒంగోలు మండలం దసరాజు పల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గేటు తాళాన్ని పగలగొట్టి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఉన్న వెండి కళ్ళు, నామాలు అపహరించారు. ఉదయాన్నే దొంగలు పడ్డారని విషయాన్ని గుర్తించిన ఆలయ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.