TG: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు పండుగ వాతావరణంలా కనిపిస్తున్నాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.