JGL: మల్యాల మండలం గుడిపేట గ్రామ క్రీడా మైదానంలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన చందన్ కుమార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో మల్యాల జట్టుపై ముత్యంపేట జట్టు ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం టోర్నీ నిర్వాహకులు విజేత, రన్నరప్ జట్లకు బహుమతులు, నగదు పురస్కారాలను అందజేశారు.