ATP: అనంతపురం పీఏబీఆర్ లోని ఇంటెక్ వెల్లో కొత్త మోటార్ బిగించాల్సి ఉండడం, పైపులైన్ లీకేజీ కారణంగా బుధవారం సాయంత్రం, గురువారం ఉదయం నగరంలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.జస్వంత్ రావు తెలిపారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.