WGL: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతాపూర్లో 2026-27 విద్యా సంవత్సరం 1వ తరగతి ప్రవేశాలకు ఎస్సీ విద్యార్థులను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాలను పాఠశాల యాజమాన్యానికి పంపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.