KDP: చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి వాహనదారులకు ట్రాఫిక్ నియమాలను వివరించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. సైలెన్సర్లు మార్చి శబ్ద కాలుష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం సేవించి, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారీనపడవద్దని, ప్రమాదాల నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు.