కోనసీమ: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఈనెల 5న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు (D) నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి వహీద సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలకు అర్హులని ఆమె స్పష్టం చేశారు.