NTR: విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ హోటల్లో నిల్వ ఉంచిన స్వీట్ కార్న్ వడ్డించారన్న ఫిర్యాదుతో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాస్ తెలిపారు. నిల్వ స్వీట్ కార్న్ విక్రయిస్తున్నట్లు నిర్ధారించి సంస్థపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఎఫ్ఎస్ఓ రవీంద్ర పాల్గొన్నారు.