KRNL: కారులో ప్రయాణికులను ఎక్కించుకునే విషయంలో ఏర్పడిన వివాదం కార్ డ్రైవర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్నూలులోని బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న కార్ స్టాండ్లో ఉప్పరి వీరేశ్పై మరో డ్రైవర్ ఆంజనేయులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. రాయి, కారు తాళం చెవితో కొట్టడంతో వీరేశ్కు రక్తగాయాలయ్యాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.