KDP: కలసపాడు(M)చెన్నుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని SC కాలనీలో గత 3 నెలలుగా విరిగిన కరెంట్ స్తంభం ప్రమాదానికి ఆహ్వానం పలుకుతోంది. స్తంభం ఎప్పుడైనా కూలిపోయి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విరిగిన కరెంట్ స్తంభం గురించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలన్నారు.