MHBD: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న, కోహెడలో నూతన పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో జూన్ 3న కూడా కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం తెలిపారు. జూన్ 4 నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని, రైతులు సెలవు రోజుల్లో సరుకులు తీసుకురాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.