SRD: కంగ్టి మండల తడ్కల్ హక సర్వీస్ సెంటర్లో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి హరీష్ పవర్ తెలిపారు. 30 కిలోల బస్తా ధర రూ.2452.50గా నిర్ణయించగా, ఒక బస్తా 2.5 ఎకరాలకు సరిపోతుందని పేర్కొన్నారు. అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌తో వ్యవసాయ కార్యాలయానికి వచ్చి విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.