GNTR: జిల్లాలో జలధార పనులను జూన్ 15 నాటికి పూర్తి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రగతి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకుండానే ముగించిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.