VSP: మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను నిరుద్యోగ యువత, ఎంపికైన అభ్యర్థులు ఖండించారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సుమారు 600 మంది పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ జరగలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అవకాశాలు కల్పించిందని వారు పేర్కొన్నారు.