BPT: సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం బీసీ కాలనీ రహదారిపై మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది కాలంగా కాలువల క్లీనింగ్ పనులు అస్సలు జరగలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని, అధికారులు స్పందించి సైడ్ కాలువల్లో పూడిక తీయించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరుతున్నారు.