MDK; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం జాప్యం చేయడాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లాకు చెందిన యువకుడు ఇషాన్ రెడ్డి 2010లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మబలిదానం చేశాడు. తెలంగాణ సాధన కోసం పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్న ఆయన త్యాగం ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. యువత, విద్యార్థుల్లో ఆవేశాన్ని రగిలించి తెలంగాణ ఆకాంక్షను మరింత బలపరిచింది.