WG: మొగల్తూరు సహకార సంఘం నూతన సీఈవోగా చింతపల్లి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఈవోగా విధులు నిర్వహించిన కొత్తపల్లి గోవిందరాజులు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన సీఈవోకు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. సహకార సంఘం అభివృద్ధికి తన వంతు పూర్తి కృషి చేస్తానని అన్నారు.