కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య నెహ్రూ పార్క్ వద్ద సైబర్ మోసాలపై సోమవారం సాయంత్రం ప్రజలకు అవగాహన కల్పించారు. నకిలీ లోన్ యాప్‌ల డౌన్లోడ్ వల్ల మొబైల్ డేటా దొంగిలించబడి, బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రుణాలు అవసరమైతే బ్యాంకులనే సంప్రదించాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.