MBNR: కౌకుంట్ల మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సోమవారం ఎస్ఐ నాగన్న వివరాల ప్రకారం… కౌకుంట్లకు తూర్పు రామకృష్ణ(29) అప్పంపల్లి నుండి డీజిల్ తీసుకుని స్వగృహానికి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి పరారైంది. ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.