AP: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన విలువైన కానుక ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధి, సరకు రవాణా, ఎగుమతులకు ఊతం లభిస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.