చిత్తూరు నగరంలోని సుబేదార్ వీధిలో షాప్ ముందు పార్క్ చేసిన బైక్ను ఓ వ్యక్తి హ్యాండ్ లాక్ విరగొట్టి చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో దొంగతనాల నివారణకు కట్టుదిట్టమైన నిఘా అవసరమని స్థానికులు కోరుతున్నారు.