GNTR: ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన పలువురు అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ల్యాండ్ పూలింగ్, భూసేకరణకు సంబంధించిన సమస్యలపై వారు జగన్‌తో చర్చించనున్నట్లు సమాచారం. తమ గ్రామాలను పూలింగ్ నుంచి మినహాయించాలని ఈ రైతులు ఇటీవలే కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్‌ను కూడా ఆశ్రయించారు.