ATP: చిన్నపాటి వర్షానికే నగరంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైందని, విద్యుత్ సేవలు నిలిచిపోయినా పాలకులు పట్టించుకోవడం లేదని మాజీ మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో సైఫుల్లా బేగ్, నరసింహులుతో కలసి మాట్లాడారు. కూలిన చెట్లను తొలగించలేదని, సకాలంలో పూడికతీత తీయకపోవడం వల్లే ఇబ్బందులు వచ్చాయన్నారు.