W.G: ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ప్రభుత్వం చొరవ తీసుకుని వారిని ఆదుకోవాలని మాజీ MLC అంగర రామమోహన్ కోరారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్య రైతులు గిట్టుబాటు ధరలు లేక ప్లాంట్ల యాజమాన్యాల సిండికేట్ విధానాలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మందుల ధరల భారంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.