CTR: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పాలసముద్రం ఎస్సై రాజశేఖర్ తెలిపారు. బలిజ కండ్రిగలో తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడుకు చెందిన గోవిందరాజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నామన్నారు. బలిజ కండ్రిగ, పచ్చికాపల్లం లో చోరీ చేసినట్టు విచారణలో తెలిసిందన్నారు. నిందితుని వద్ద 4 గ్రాముల బంగారం, 115 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.