HNK: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించి అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో బల్దియా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.