PDPL: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాల్లో ఏళ్లుగా పనిచేస్తున్న నాన్-టీచింగ్ సిబ్బందిని తొలగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కార్మికులను ఒక్కసారిగా తొలగించడం అన్యాయమన్నారు.