KNR: నగరపాలక సంస్థ పరిధిలోని మల్కాపూర్, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను సోమవారం మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ప్రారంభించారు. పాలకవర్గ సభ్యులతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గృహ ప్రవేశాలు చేశారు.