NGKL: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్ 12 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన గోడపత్రికను నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ విడుదల చేశారు.