BPT: బల్లికురవ మండలం ముక్తేశ్వరం – రామాంజనేయపురం గ్రామాల మధ్య ఉన్న ఎన్ఎస్పీ కాలువ కల్వర్టు పూర్తిగా పగిలిపోయి, రోడ్డు కోతకు గురైంది. దీంతో ఈ దారి తీవ్ర ప్రమాదభరితంగా మారిందని, ముఖ్యంగా రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.