మహబూబ్నగర్ జిల్లా పశు వైద్యాధికారిగా నియమితులైన శివానంద స్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పాడి పరిశ్రమతో పాటు పశు వైద్యాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. నూతన వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయనను జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.